Sep 10,2023 17:37

ప్రజాశక్తి - పెనుమంట్ర
            పొలమూరు అంబేద్కర్‌ కాలనీలో షార్ట్‌ సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అంబేద్కర్‌ కాలనీకి చెందిన ఇంజే ఇజ్రాయిల్‌, అతని కుమారుడు ఇంజే నాగేశ్వరరావు, కోడలు ప్రేమకుమారి, ఇద్దరు చిన్నారులు ఒకే తాటాకింట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వీరంతా ఆదివారం ఉదయం చర్చికి వెళ్లారు. తిరిగొచ్చిన కొంతసేపటికి సుమారు 11 గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇల్లు పైకప్పు నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంటిలో ఉన్న సామగ్రి కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న అత్తిలి ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిస్థాయిలో అదుపుచేసింది. తాటాకింట్లో రూ.60 వేల నగదు, సామగ్రి కాలి బూడిదైందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.