Apr 21,2023 00:53
కాలిపోయిన కరెన్సీ నోట్లు

ప్రజాశక్తి-చీరాల: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రేకుల ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని ఈపూరు పాలెం లో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఈపూరుపాలెం సత్రంబజారులో గుండపు పద్మావతికి చెందిన ఇంట్లో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంబవించింది. ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు వ్యాపించి మంట లు చెలరేగాయి. దీంతో స్థానికులు సమాచారా న్ని అగ్నిమాపక కేంద్రానికి అందజేశారు. వారు వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం లో పద్మావతి నూతన ఇంటిని నిర్మించుకునేం దుకు ఇంటిలో దాచిపెట్టుకున్న నగదు రూ.10 లక్షల నోట్లు అగ్నికి ఆహుత య్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నగదుతోపాటు ఇల్లు, వస్తువులు, ఇంటికి సంబంధిం చిన ధ్రువీకరణ పత్రాలు, కుమారుడికి సంబంధించిన మానసిక దివ్యాంగుల నిర్ధారణ పత్రం, బ్యాంకు పుస్తకాలు తదితర విలువైన వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు బాధితురాలు పద్మావతి వాపో యారు. చేనేత వృత్తి చేసుకుని జీవించి తనకు ఈ ఘటనలో నష్టం జరిగిందని ప్రభుత్వం, నాయకులు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. ఘటన జరిగిన విషయం తెలుసుకున్న ఈపూరుపాలెం ఎస్‌ఐ జనార్ధన్‌, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.