Jun 11,2023 13:29

సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

తైక్వాండో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపు ముగింపులో ఎమ్మెల్యే కాటసాని
ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ :
సమ్మర్‌ క్యాంపుల ప్రాధాన్యతను గుర్తించి ఇంతమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మంచి పరిణామమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కర్నూలు స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు సంతోష్‌నగర్‌ ఇన్‌ఛార్జి లలితకీర్తన, ఎపిమోడల్‌స్కూలు పెద్దపాడు ఇన్‌ఛార్జి రోహిత్‌, ప్రజాశక్తి ఎడిషన్‌ కేంద్రం ఇన్‌ఛార్జి జి.షబ్బీర్‌ హుస్సేన్‌ నిర్వహిస్తున్న క్యాంపుల ముగింపు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపల్‌రెడ్డి, స్పెషల్‌బ్రాంచి డిఎస్‌పి ఎస్‌.మహబూబ్‌బాష, ప్రజాశక్తి జనరల్‌ మేనేజర్‌ టి.నరసింహా హాజరయ్యారు. సుందరయ్య పార్కు అవరణలో ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పి.చంద్రయ్య అధ్యక్షతన జరిగిన సభలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ శారీరక శ్రమ చక్కటి ఆరోగ్యాన్ని, మనం ఎంచుకునే లక్ష్యం పట్ల ఆసక్తిని పెంచుతుందని అన్నారు. శ్రద్ధతో సాధన చేస్తే ఏదైనా సాధించవ్చని సూచించారు. ప్రతిఒక్కరు తల్లిదండ్రులను, గురువులను గౌరవింనప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. తైక్వాండో అభివృద్ధికి ఎమ్మెల్యేగా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఓర్వకల్లు పరిశ్రమలలో ఉద్యోగాలు ఇప్పించడానికి క్రీడాకారులకు ఎంత సహకరిస్తామో అంత చేస్తామన్నారు. శారీరకంగా ధృడంగా ఉంటేనే చదువుకోగలుగుతారన్నారు. ప్రజాశక్తి ఎదురుగా ఉన్న సుందరయ్య పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉంటే ఎవరైనా కబ్జా చేసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ కబ్జా చేసినా తానే చేసినట్లు పత్రికలు రాస్తున్నాయన్నారు. అలాంటిపుకార్లు రాకుండా పార్కును అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. స్పెషల్‌ బ్రాంచి డిఎస్‌పి ఎస్‌.మహబూబ్‌బాష మాట్లాడుతూ సమ్మర్‌ క్యాంపులు పిల్లలకు ఇతర అలవాట్లకు వెళ్లకుండా ఆటల పట్ల ఆసక్తి పెరిగేలా పని చేస్తాయన్నారు. అలాంటి కృషి చేసిన తైక్వాండో కోచ్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ను అభినందించారు. ఆల్‌ఇండియా యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీలలో ఎస్‌వి యూనివర్సీటీ నుంచి ఆడానని, ఆ పిట్‌నెస్‌ ఎస్‌ఐ సెలక్షన్‌కు ఉపయోగపడిందన్నారు. మా పిల్లలను కూడా క్రీడలపట్ల ఆసక్తి పెంచేలా చేశాయన్నారు. మా అబ్బాయి క్రికెట్‌లో మంచి ప్లేయర్‌ అయ్యాడని, భుజం నొప్పితో హైలెవల్‌కు వెళ్లలేక పోయారన్నారు. క్రీడల సాధన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని సూచించారు. కాబట్టి క్రీడలను ప్రోత్సహించాలని తలిదండ్రులను, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని కోరారు. తనవంతు కూడా సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్‌ తైక్వాండో కోచ్‌ కపిల్‌, సల్మాన్‌, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతకు ముందు తైక్వాండో డెమో విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్యాడ్‌ వర్క్‌, బ్రిక్స్‌ బ్రేకింగ్‌లో చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అనంతరం సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే, డిఎస్‌పి ప్రదానం చేశారు.

 

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి బొకేను అందజేస్తున్న క్రీడాకారిని
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి బొకేను అందజేస్తున్న క్రీడాకారిని
మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి
మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి
 తైక్వాండో క్రీడాకారులతో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డిఎస్‌పి మహబూబ్‌బాష, తదితరులు
తైక్వాండో క్రీడాకారులతో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డిఎస్‌పి మహబూబ్‌బాష, తదితరులు
 తైక్వాండో క్రీడాకారులతో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డిఎస్‌పి మహబూబ్‌బాష, తదితరులు
తైక్వాండో క్రీడాకారులతో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డిఎస్‌పి మహబూబ్‌బాష, తదితరులు