ప్రజాశక్తి-ఏ కొండూరు : కాపుసారా మత్తులో మునిగి తేలుతున్న తమ భర్తలు ఇళ్లకు కూడా రావడం లేదని ఆగ్రహించిన మహిళలు మంగళవారం విజయవాడ-తిరువూరు జాతీయ రహదారిపై బెల్టు షాపు ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కష్ణారావు పాలెం గ్రామ సమీపాన జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న లారీ ఆఫీస్ ఎదుట పలువురు వ్యక్తులు డ్రింక్ షాపులు హౌటల్లు పెట్టుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వీరు వ్యాపారాల మాటున కాపు సారా. మద్యం విక్రయిస్తూ తమ భర్తలను పిల్లలను తాగుబోతులుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలోని మహిళలు బెల్టు షాపు ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. సారా మద్యం అమ్మకాలనుఅరి కడితే తమ భర్తలు పిల్లలు ఇళ్లకు వస్తారన్నారు. ఇన్ని అనర్ధాలకు కారణమైన కాపు సారా విక్రయాలు వెంటనే అరికట్టాలని నినాదాలు చేశారు. వీరికీ మద్దతుగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పానెం ఆనందరావు నిరసన కార్యక్రమంలో పాల్గొని దశలవారీగా మధ్య నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోయారని, సారా విక్రయాలను అరికట్టవలసిన ఎక్సైజ్ అధికారులు అసలు పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ విషయమై మహిళలు ఏ కొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో షేక్ ఫాతిమా సుభాన్ బి జమీల కరిమున్ ఖాజాబీ కరిముల్లా బీజాన్ మొయునుద్దీన్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.










