Jun 24,2023 00:01

ర్యాలీ చేపడుతున్న ప్రజాప్రతినిధులు ,యువకులు

ప్రజాశక్తి- నక్కపల్లి:మండలంలోని మత్స్యకార గ్రామమైన బంగారమ్మపేటలో నాటు సారా నియంత్రణకు యువత నడుం బిగించింది. ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలతో శుక్రవారం సమావేశం నిర్వహించి గ్రామంలో నాటు సారా నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్‌ గోసల నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యులు చేపల రాజు గురువులు, సచివాలయ పోలిసు ఆధికారిని సునీత, మత్స్యకార నాయకులు కొవిరి గంగాధర్‌, కొవిరి వెంకటేష్‌ ఆధ్వర్యంలో యువత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో సారా నిషేధిం చేందుకు గ్రామస్తులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. నాటు సారా తాగడంతో అనేకమంది రోగాలు బారిన పడి, కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈనెల 30వ తేదీ తర్వాత గ్రామంలో నాటు సారా తయారుచేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చేపల మురళి, కోడ ఏసు, కొవిరి స్వామి, పేర్ల శ్రీను, యజ్జల కాశీరావు, పేర్ల గోవిందు, సిరిపిన శ్రీను పాల్గొన్నారు.