ప్రజాశక్తి -పాయకరావుపేట : సారా నిందితులకు స్వయంఉపాధి కోసం ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా 17మందికి రాయితీపై రుణాలు మంజూరు చేశామని, ఎస్‌ఇబి పాయకరావుపేట సిఐ తేజ వెంకటకుమార్ అన్నారు. మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, సారా వ్యాపారం మానేసి, ప్రత్యామ్నాయంగా వేరే ఏదైనా వ్యాపారం చేసి జీవనోపాధి పొందేందుకు వీలుగా ఈ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సారా నిందితులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎస్‌సి కార్పొరేషన్ ఎఇఒ ఝాన్సీ మాట్లాడుతూ సారా కేసుల్లోని నిందితుల కుటుంబపోషణకు ప్రత్యామ్నాయ వ్యాపారం చేసుకొనుటకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ రుణాలను మంజూరు చేసిందన్నారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లోని 17మందికి ఈ రుణాలు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్ అధికారులు శంకర్, భాస్కర్ పాల్గొన్నారు










