Nov 01,2022 23:25

నిరసన చేపడుతున్న నిర్వాహకులు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: అరకులోయ ట్రైబల్‌ మ్యూజియం ఎదురుగా నూతనంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ షాపులు నెలసరి అద్దెలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కేటాయించిన షాపుల వద్ద నిరసన చేపట్టారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి ఏకపక్ష నిర్ణయంతో నెలసరి అద్దెలు కింద షాపులు 8వేలు,పైన షాపులు 6వేలు నిర్ణయాన్ని వెనక్కి తీసకోని షాపులు అద్దెలు తగ్గించాలని వ్యాపారులు అన్నారు. ఏకపక్ష నిర్ణయంతో గిరిజన నిరుద్యోగులు నెలసరి అద్దెలు చెల్లించలేమని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్కు, ప్రాజెక్ట్‌ అధికారికి ఎన్నిసార్లు వినతిపత్రం అందజేసినప్పటికీ పట్టించుకో లేదని గిరిజన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వెనుకబడిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో గిరిజన నిరుద్యోగుల కేటాయించడం జరిగిందన్న ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి లక్షల్లో డిపాజిట్లు కట్టించుకొని వేళల్లో అద్దెలులు పెట్టి వ్యాపారం చేయడం సరికాదన్నారు.తక్షణమే అధికారులు స్పందించి నెలసరి అద్దెలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ. నాగేశ్వరరావు. గంగాధర్‌. పూర్ణయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు.