
ప్రజాశక్తి - భట్టిప్రోలు
పంచాయతీలో సానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న శ్రీరాములుకు పదోన్నతి లభించింది. శ్రీకాకుళం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిగా పదోన్నతి పొంది బదలీ కానున్నారు. సర్పంచ్ ధారా రవికరణ్మయి బదిలీ పత్రాన్ని శ్రీరాంకు అంద చేశారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇప్పటికే గ్రామంలో రెండుసార్లు శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసిన శ్రీరాములు ప్రజలందరికీ సుపరిచితుడని అన్నారు. క్రమం తప్పకుండా విధులు నిర్వహించేవాడని అన్నారు. నిబద్ధతతో పనిచేసేవారని అన్నారు. సిబ్బందితో పని చేయింస్తూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండేవారన్నారు. ఆయన పదోన్నతి పొందటం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి కోట శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది అభినందించారు.