శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం వద్దు - కమీషనర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పట్టణంలో శానిటేషన్ పనుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, శానిటేషన్ పనులను మరింత మెరుగ్గా చేయాలని మున్సిపల్ కమీషనర్ సి. రవి చంద్రారెడ్డి ఆదేశించారు.బుధవారం మునిసిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ తో కలిసి శ్రీనివాస సెంటర్ , నునేపల్లి మెడికల్ కాలేజీ వద్ద రోడ్ సైడ్ ఉన్న మట్టిని తొలగించే పనులను చౌక్ లో ఉన్న మార్కెట్ ను పరిశీలించారు.శానిటేషన్ పనుల యందు నిర్లక్ష్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజి కాలువలలో రోజువారీగా సిల్ట్ తీయాలన్నారు.
సచివాలయాల ఆకస్మిక తనిఖీ లు..
అలాగే శానిటేషన్ పనులను పరిశీలించడం తో పాటు మునిసిపల్ కమిషనర్ 18, 20, 23 వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు.స్పందన గ్రీవెన్స్ రిజిస్టర్లు తనిఖీ చేసి సచివాలయం సిబ్బందికి రిజిస్టర్ మెయింటనెయన్స్ అటెండన్స్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు.
శానిటేషన్ పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్
సచివాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్










