Jun 23,2023 23:51

పొన్నూరు రూరల్‌: స్థానిక 12, 13, 14, 15 వార్డులలో శానిటేషన్‌ పనులను పొన్నూరు కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ శుక్రవారం పర్యవేక్షించారు. వార్డు శానిటరీ సెక్రటరీలు ,శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదుకు పారిశుధ్య నిర్వహణపై పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బం దులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కంపోస్ట్‌ యార్ట్‌ పరిశీలించి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ పంపించిన మిషనరీతో యార్డును మొత్తం శుభ్రపరిచే విధంగా చూడాలని అన్నారు. అలాగే, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ లో వాటర్‌ ప్లాంట్‌ ను పరిశీలించి దాని చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, పాచి పట్టిన బెట్టిల్ని శుభ్రపరచాలని సూచించారు. ఇటికంపాడు రోడ్‌లో యానాది సంఘం దగ్గర పెద్ద కాల్వ లో పూడికలు తీసేందుకు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌్‌ నాగేశ్వరరావు, వెంకట్‌ దగ్గర ఉండి జెసిబి తో కాల్వల్లో పూడికలు తీయించాలని ఆదేశించారు.