Oct 19,2023 00:18

నినాదాలు చేస్తున్న శానిటేషన్‌ కార్మికులు

ప్రజాశక్తి-పాడేరు: తమకు 4 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎల్‌.సుందరరావు మాట్లాడుతూ,. అల్లూరి జిల్లా పరిధిలో పాడేరు జిల్లా ఆసుపత్రి, అరకు, చింతపల్లి ఏరియా ఆసుపత్రి, ముంచంగిపుట్టు ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 80 మంది పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలు జీతం బకాయి వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు, ఇచ్చే కొద్ది పాటి జీతానికి శానిటేషన్‌ కార్మికుల్ని ఆర్థిక ఇబ్బందులకు గురి చేయవద్దని, ఇప్పటికి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పిల్లల చదువుకు పిజులు కట్టలేక పోతున్నారన్నారు. కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని, ఒకపక్క నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.అప్పులు తెచ్చిన వడ్డీలు కట్టలేక పోతు మానసికమైన ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు. జీతం చెల్లించకుంటే పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ వేతన బకాయిలు చెల్లించాలని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ హేమలతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు ముత్యాలమ్మ, ఘటి, సుధారాణి, పుణ్యవతి, కానక లక్మి, మాధవి, నగేష్‌, సింహాచలం, చిట్టిబాబు, సింహాద్రి, నాగ భూషణ్‌, గిరిజన సంఘం నాయ కులు బొజ్జన్న పాల్గొన్నారు.