
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సవితమ్మ
ప్రజాశక్తి -పెనుకొండ : ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియచేసే హక్కులేదా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ప్రశ్నించారు. బుధవారం పట్టణంలోని తన స్వగృహంలో సవితమ్మ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శాంతియుతంగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అక్రమంగా దౌర్జన్యంగా భగం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతియుతంగా దీక్ష చేపడితే అరెస్టు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. పోలీసులు తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడదాకుల పల్లి మాజీ సర్పంచి ప్రసాద్, మాగే చెరువు సర్పంచి నరసింహులు, త్రివేంద్ర నాయుడు బాబుల్ రెడ్డి, నిసార్, సనావుల్లా, బాలాజీనాయక్, ప్రకాష్, వాసుదేవ రెడ్డి, సానిపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.