శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు - జిల్లా ఎస్‌పి డి.మేరీ ప్రశాంతి
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి తెలిపారు. మంగళవారం ఏజెన్సీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిశీలనలో భాగంగా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి, మద్యం, గుట్కా రవాణాపై నిరంతరం నిఘా ఉంచి అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పోలవరం డిఎస్‌పి లతాకుమారి, సిఐ బి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: స్థానిక పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్‌పి డి.మేరీ ప్రశాంతి మంగళవారం సందర్శించారు. ఆమె ఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించాక బుట్టాయగూడెం తొలిసారి వచ్చారు. బుట్టాయగూడెం స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి, సిఐతోపాటు ఎస్‌ఐ జయబాబు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలవరం: జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారీ, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. కార్యక్రమంలో సిఐ విజరుబాబు, ఎస్‌ఐ పవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.










