బాధ్యతలు స్వీకరిస్తున్న సిద్థార్థ్ కౌశల్
కడప అర్బన్ : నూతన ఎస్‌పిగా సిద్ధార్థ్ కౌశల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జిల్లాలో పని చేయడం చాలెంజ్‌గా తీసుకుంటానని తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను ఉపేక్షించమని హెచ్చరించారు. మహిళల భద్రతపై నిఘా పెంచుతామని పేర్కొన్నారు. గంజాయి, ఎర్రచందన స్మగ్ల ర్లలపై ఉక్కువ పాదం మోపుతామని స్పష్టం చేశారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ విజరు రామరాజును మర్యాద పూర్వకంగా కలిశారు.










