Sep 12,2023 09:23

పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

        కొత్తచెరువు : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ మాధవరెడ్డి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం నాడు టిడిపి నిర్వహించిన బంద్‌ సందర్భంగా ఆయన కొత్తచెరువలో పర్యటించారు. పోలీసులు తీసుకున్న చర్యలపై వారితో మాట్లాడారు. బస్టాండ్‌ కూడలిలో పోలీసులతో కలిసి బంద్‌ ప్రభావాన్ని పరిశీలించారు. ఈ ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. రాస్తారోకోలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాసుదేవన్‌ సిఐ రాగిరి రామయ్య ఎస్‌ఐలు లింగన్న, నరసింహులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.