Nov 11,2023 20:32

కురుపాం : నీలకంఠాపురం పోలీసు స్టేషన్‌లో మొక్క నాటి నీళ్లు పోస్తున్న డిఐజి హరికృష్ణ

సీతంపేట: విశాఖ రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతల పరి రక్షణకు చర్యలు తీసుకుంటు న్నట్టు రేంజ్‌ డిఐజి ఎస్‌.హరి కృష్ణ అన్నారు. శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ను సందర్శించారు. రికార్డులను పరిశీ లించి, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా పోలీసు లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే పోలీసులు దత్తత తీసుకున్నారని, ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే ఎస్సై పోస్టులు రిక్రూట్మెంట్‌ జరిగిందని, ఖాళీ ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులు త్వరలో భర్తీ చేస్తున్నామన్నారు. అలాగే రేంజ్‌ పరిధిలో పోలీస్‌ క్వార్టర్స్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, పాలకొండ డిఎస్‌పి జివి కృష్ణారావు, సిఐ మురళీధర్‌, సీతంపేట, బత్తిలి ఎస్సైలు నీలకంఠ రావు, అమ్మన్నరావు తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌ స్టేషన్‌ను డిఐజి ఎస్‌.హరికృష్ణ అకస్మికంగా సందర్శించి స్టేషన్‌లో గల రికార్డులన్నీ పరిశీలించి అనంతరం మొక్కను నాటారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బందితో మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్నటువంటి పోలీస్‌ స్టేషన్‌ కనుక ఎప్పటికప్పుడు పోలీస్‌ సిబ్బంది అంత అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్‌గా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ, డిఎస్‌పితో పాటు సిఐ సత్యనారాయణ, స్థానిక ఎస్‌ఐ డి.అనిల్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.