Nov 08,2023 22:01

రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌

ప్రజాశక్తి-కురుపాం, గుమ్మలకీëపురం : స్థానిక భాషలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ తెలిపారు. గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని బతికించుటకు స్థానిక భాషలను ప్రోత్సహించాలన్నారు. బుధవారం గుమ్మలకీëపురం, కురుపాం మండలాలలో ఆయన పర్యటించారు. సవరభాషపై గుమ్మలకీëపురం వైటిసి భవనంలో ఏర్పాటు చేసిన ఓరియంటేషను కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గర్భిణుల వసతిగృహాన్ని సందర్శించారు. గర్భిణులకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం వారికి పౌష్టికాహారం అందించాలని తెలిపారు. వారికి రక్తహీనత పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి మందులు సరఫరా చేయాలని తెలిపారు. ఆసుపత్రిలోనే ప్రసవం చేసుకోవాలని సూచించారు.
కురుపాం మండలంలో నారేడుమానుగుడ, జోడుమానుగుడ, సెంటర్‌గుడ, పోరందంగుడ గ్రామాలలో నిర్మిస్తున్న బి.టి.రోడ్డు పనులను పిఒ పరిశీలించారు. మెటీరియల్‌ క్వాలిటీ పరిశీలించారు. పనులు నాణ్యంగా చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మొండెంఖల్‌ గ్రామంలో నిర్మిస్తున్న గిరిజన సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించి, సకాలంలో నిర్మాణ పనులను పూర్తిచేయాలని, పనులు నాణ్యంగా ఉండాలని తెలియజేశారు.
మాతృభాషలో శిక్షణ తరగతులు
గుమ్మలక్ష్మీపురం గిరిజన యువ శిక్షణ కేంద్రంలో రెండు రోజులపాటు మాతృభాషలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. బుధవారం ఈ కార్యక్రమానికి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి విష్ణు చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి రోజు సవర భాష ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. సవర భాషలో విద్యాబోధన ఎలా చేపట్టాలో శిక్షణ ఇచ్చారు. డిడి శ్రీనివాసరావు, ఎటిడబ్ల్యుఒ సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ చంద్రశేఖర్‌ ఉన్నారు.