
ప్రజాశక్తి-టంగుటూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.రమణయ్య పేర్కొన్నారు. 68వ రాష్ట్ర అవతరణ సందర్భంగా బుధవారం వల్లూరు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు వివిధ రకాల ఆట, పాటలతో అలరించారు. వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు 3 బ్యాచ్‌లుగా 16 మంది విద్యార్థులు ఈ సాంస్కతిక ప్రదర్శనకు హాజరయ్యారు. విద్యార్థులు కనబరిచిన ప్రతిభ కు కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థినులు కె సంధ్య, హర్షిణి, లిఖిత, రక్షిత, టి వసంత, కె మణిదీపిక తదితరులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్ జయలక్ష్మి, ఉపాధ్యాయులు మట్టికుంట మహేశ్వరరావు, నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.