Oct 10,2021 12:56

    సరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు. మైసూరు, కోల్‌కతా, ఒడిశా, తెలంగాణ, విజయవాడలో ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు. ఇవేకాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.
 

                                                                   మైసూరు

సాంస్కృతిక కళారూపాలే దసరా...


మైసూరు మహారాజు పాలనలో దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. చాముండేశ్వరీ దేవి వారి కులదైవం. దసరా సందర్భంగా మైసూరు వీధుల్లో కళా ప్రదర్శనలతో ఏనుగులపై మహారాజు వంశస్థులు ఊరేగుతారు.
 

                                                                  కోల్‌కతా

దసరాను బెంగాలీయులు సప్తమి, అష్టమి, నవమి తిథులలో జరుపుకుంటారు. దుర్గామాతకు పూజ చేసి, తొమ్మిదో రోజున కాళికామాతను దర్శిస్తారు. అనంతరం హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు.
 

                                                                    ఒడిశా

సాంస్కృతిక కళారూపాలే దసరా...


ఒడిశా పౌరులు, కటక్‌ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి, లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారుచేసి మైదానంలో కాలుస్తారు.
 

                                                           తెలంగాణా బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ దసరాకి రెండు రోజుల ముందే వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి, తొమ్మిది రోజులు ఒకచోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
 

                                                       విజయవాడ భేతాళ నృత్యం

సాంస్కృతిక కళారూపాలే దసరా...

దేశంలోనే ప్రధాన ఆలయాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి, విజయదశమి నాటికి కృష్ణానదిలో తెప్పోత్సవం చేస్తారు. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుతోపాటు భేతాళ నృత్యాల్ని ప్రదర్శిస్తారు.
 

                                                       వీపన గండ్లలో రాళ్ళయుద్ధం

సాంస్కృతిక కళారూపాలే దసరా...

కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్లతో యుద్ధం చేసుకుంటారు. సాయంవేళలో ప్రజలు కాలువ ఒడ్డున అటూఇటూ చేరతారు. ఒకవైపు రామసేన, మరోవైపు రావణసేనగా ఊహించుకుని ఒకరిపై ఒకరు రాళ్లను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం పొందిన యుద్ధంగా భావిస్తారు.
నవరాత్రి ఉత్సవాలలో, ఆలయాలలో పార్వతీదేవికి రోజుకో అలంకరణ చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.