మాట్లాడుతున్న నేవల్ సైంటిస్ట్ సాంబయ్య
ప్రజాశక్తి -భీమునిపట్నం :విద్యార్థి దశ నుంచే శాస్త్రసాంకేతిక అంశాలపై అవగాహన కలిగి, పట్టుసాధించాలని నేవల్ సైంటిస్ట్ దాసరి సాంబయ్య విద్యార్థులకు సూచించారు. బుధవారం స్థానిక పండిట్ నెహ్రూ జివిఎంసి ఉన్నత పాఠశాల విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. 9,10 తరగతుల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యాపరమైన అవకాశాలను వివరించి, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. ఉపకార వేతనం ఎలా పొందవచ్చో వివరించారు. అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం తిరుమల శ్రీదేవి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సత్యరాజు, బి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.










