ప్రజాశక్తి - ఏలూరు టౌన్
దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడమే కాకుండా, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 32వ వర్థంతిని స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. తొలుత రాజీవ్‌గాంధీ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశంలో టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, గ్రామ ఉపాధి అవకాశాలను ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నా యన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఎంతో అవసరమని తెలిపారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కిందన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను కొనియా డారు. నేడు టెక్నాలజీరంగంలో విప్లవాత్మక మార్పులకు మన విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు ఆయనే కారణమన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక విజయవిహార్ సెంటర్‌కు చేరుకుని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ రంగబాబు, చంద్రశేఖర్, ఉప్పు మురళీ, కృష్ణ, ఏలూరు బ్లాక్ టు కాంగ్రెస్ అధ్యక్షులు లంక రామ్మోహన్, తాళ్లూరి చక్రవర్తి, ప్రతాప సుబ్రహ్మణ్యశర్మ, చంద్రకాంతమ్మ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










