Aug 28,2023 21:06

మాట్లాడతుఉన్న ప్రిన్సిపల్‌ సుధాకర్‌రెడ్డి

చింతకొమ్మదిన్నె : సాంకేతిక విద్యను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరు కోవాలని కడప అన్న మాచార్య ఇంజి నీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం పాలిటెక్నిక్‌ డిప్ల మోలో మొదటి సంవ త్సరంలో చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్‌ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి డిప్లమా కోర్స్‌ ఒక వారధిలా ఉపయో గపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడానికి ఈ కోర్సు చాలా ఉపయోగకరమని ఆయన తెలియజేశారు. అంతర్గత క్రమశిక్షణ పెంపొ ందించుకొని కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో డిప్లమా ఇన్‌ఛార్జి మురళీ మోహన్‌ నాయక్‌, కళాశాల అన్ని విభాగాధిపతులు శశి కుమార్‌,శ్రీ చందన, రామ్మోహన్‌, మురళీకష్ణ, సుబ్బయ్య పాల్గొన్నారు.