ప్రజాశక్తి-అనంతగిరి:జగనన్న సురక్ష ధ్రువపత్రాల జారీలో ఆన్లైన్‌లో సమస్యలు సరి చేయాలని జెడ్బిటీసి దీసరి. గంగరాజు సూచించారు. మండలంలో టోకూరు పంచాయతీలో సర్పంచ్ కిల్లో .మోస్య అధ్యక్షతన శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలం ప్రత్యేక అధికారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి సూర్యలక్ష్మి, గంగరాజు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, జగ్గగన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 11 రకాల దృవీకరణ పత్రాలు ఉచితంగా అందిస్తుందని తెలిపారు. హౌస్ మ్యాపింగ్ లేనందున రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నమోదు కాలేదని అన్నారు.స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణీ మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు పధకాలు అందేలా చూడాలని సూచించారు. లబ్ధిదారులకు కుల దృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్కా .రవికుమార్, మాజీ సర్పంచ్ సారా .దొన్ను, టోకూరు, బొర్రా, .అనంతగిరి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వార్డు సభ్యులు దోన్ను, చందర్రావు పాల్గొన్నారు.










