Nov 14,2023 21:39

నెహ్రూకు నివాళులర్పిస్తున్న జెఎన్‌టియు విసి రంగజనార్దన, తదితరులు

             అనంతపురం : సాంకేతిక రంగం అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్దన అన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస ్కరించుకుని మంగళవారం స్థానిక జెఎన్‌టియు విశ్వ విద్యాలయంలోని పరిపాలన భవనంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ సాంకేతిక రంగం అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని భావించిన అప్పటి ప్రధాని నెహ్రూ అప్పట్లోనే సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కావున ప్రతి ఒక్కరూ పరిశోధనాత్మకంగా ఆలోచించినప్పుడే నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, యూనివర్సిటీ డైరెక్టర్లు కేశవరెడ్డి, శోభాబిందు, పి.సుజాత, ఎన్‌.విశాలి, వి.బి.చిత్ర, ఎ.సురేష్‌బాబు, బి.దుర్గాప్రసాద్‌, జి.వి.సుబ్బారెడ్డి, పద్మ సువర్ణ, చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఆచార్యులు వి.శంకర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఇ.అరుణకాంతి, టి.బాలనరసయ్య, టి.నారాయణరెడ్డి, ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి, డి.విష్ణువర్ధన్‌, ఎం.రామ శేఖరరెడ్డి, కె.ఎఫ్‌.భారతి, కళ్యాణి రాధా, దిలీప్‌కుమార్‌, అజిత, శివలింగారావు, డిప్యూటి రిజిస్టార్‌ ఎన్‌.మధుసూదనరెడ్డి, దుర్గాప్రసాద్‌, బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.