
కార్యాలయంలో క్యూలో ఉన్న క్రయవిక్రయదారులు
ప్రజాశక్తి-నక్కపల్లి:సాంకేతికంగా లోపంతో ఈ కేవైసీ కాక పోవడంతో క్రయవిక్రదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం భూములు, ఇంటి స్థలాలు, తదితర స్థలాల రిజిస్ట్రేషన్‌కు అధిక సంఖ్యలో క్రయవిక్రదారులు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం 3.30 గంటల వరకు ఈ కేవైసీ నమోదు కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచి పోయాయి. ఆ తర్వాత ఒక గంట పని చేసి మరలా సాంకేతిక లోపం తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు ఆగి పోయాయి. క్రయ విక్రయదారులు గంటల కొద్దీ క్యూ లైన్‌లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రిజిస్ట్రేషన్లకు కార్యాలయం వద్ద పడిగాపులు గాచారు. తరచూ ఇటువంటి సమస్యలు తలెత్తుతుంటే రిజిస్ట్రేషన్లు ఎలా చేయించుకోవాలని క్రయవిక్రదారులు ఆవేదన చెందుతున్నారు.