Aug 25,2023 21:53

పూజలు చేసేందుకు వెళుతున్న దృశ్యం

పూజలు చేసేందుకు వెళుతున్న దృశ్యం
సామూహిక వరలక్ష్మీ వ్రతం
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం:శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జొన్నవాడ క్షేత్రం, బుచ్చిరెడ్డిపాలెం మండలం,రెండవ శ్రావణ శుక్రవారం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు దేవస్థానంలో
100 మంది ముత్తైదువులుచే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నిర్వహించారు.కళావేదిక పై శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా శ్రావణ వరలక్ష్మి వ్రతం
కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో దేవస్థాన ఛైర్మన్‌ పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వరు,్ల దంపతులు, పాలక మండలి సభ్యులు తిరువాయిపాటి నందకుమార్‌, తిరుమూరు సుప్రజా గుమ్మా రఘు రామయ్య, అములూరు విమల, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పారీ