Oct 11,2023 23:42

సామూహిక గృహప్రవేశాలు పండుగలా నిర్వహించాలి: కలెక్టర్‌

సామూహిక గృహప్రవేశాలు పండుగలా నిర్వహించాలి: కలెక్టర్‌
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో వడమాల పేట మండలం జగనన్న కాలనీ కాయం లేఔట్‌లో సామూహిక గృహ ప్రవేశాలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కే వెంకట రమణ రెడ్డి తెలిపారు.బుధవారం ఉదయం వడమాల పేట మండలం పరిధిలోని కాయం లేఅవుట్‌ ను కలెక్టర్‌ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గృహ ప్రవేశాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా మిగిలిపోయిన గృహ నిర్మాణ పనులు ఏవైనా వుంటే వాటిని సమీక్షించుకుని పూర్తి చేయాలన్నారు. గృహ ప్రవేశా లను పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచిం చారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వివరిస్తూ కాయం లేఅవుట్‌ కు సంబంధించి ఎకరాలు 27.20 సెంట్ల లో అందులో 780 ఇళ్లు మంజూరు చేశారని, కాయం లేఅవుట్‌లో పూర్తి అయినగృహాలకు విద్యుత్‌, తాగు నీరు కనెక్షన్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొననున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ డిఈ చంద్ర శేఖర్‌ బాబు, ఏఈ ముత్తు కుమార్‌ స్వామి, వడమలపేట తహశీల్దారు సుబ్రమణ్యం పాల్గొన్నారు.