Nov 03,2023 20:57

వీరఘట్టం : పరీక్షా పత్రాలు విడుదల చేస్తున్న ఎంఇఒలు

ప్రజాశక్తి - వీరఘట్టం :  విద్యార్థుల విద్యాసామర్థ్యం వెలికి తీసేందుకే స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వీస్‌ ఉద్దేశిమని ఎంపిడిఒ వై.వెంకటరమణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని నడిమికెళ్లలో ఎంపియుపి పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షను పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. చదువు విషయంలో ప్రతి ఒక్కర్లో పోటీతత్వం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకుని ఇటు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చేలా పట్టుదలతో చదవాలన్నారు. మండలంలోని 24 పాఠశాలల నుండి 39 పరీక్ష గదుల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గణితం, భాషా సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఇఒలు ఆర్‌.ఆనందరావు, డి.గౌరినాయుడు, ఇన్వెజిలెటర్లు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కురుపాం : స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్మెంట్‌ సర్వే/నేషనల్‌ అచీవ్మెంట్‌ సర్వే పరీక్షకు మండలంలోని 21పాఠశాలలకు చెందిన 3,6,9 తరగతులు విద్యార్థులు 881మంది హాజరయ్యారు. మండలంలో పలు పరీక్ష కేంద్రాలను ఎంఇఒ ఎన్‌.సత్యనారాయణ, ఎఎంఒ బి.శ్రీనివాస్‌ సందర్శించి పరిశీలించారు.
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని పలు పాఠశాలల్లో జరుగుతున్న స్టేట్‌ లెవెల్‌ అచీవ్మెంట్‌ సర్వే టెస్ట్‌ను ఎంఇఒలు చంద్రశేఖర్‌, జనార్దన్‌నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు పలు పాఠశాలలను పరిశీలించి మోడల్‌ టీం సభ్యులకు, సపోర్టింగ్‌ టీచర్లకు, సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అచీవ్మెంటు సర్వే టెస్టును పకడ్బందీగా ప్రతి ఒక్కరూ నిర్వహించాలన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేస్తామన్నారు. ఈ మేరకు పాఠశాలల ఉపాధ్యాయులు మోడల్‌ టీం సభ్యులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయన వెంట నోడల్‌ టీం బృందం సభ్యులు సూర్యనారాయణ, బంటు సింహాచలం, ఎం.భాస్కర్‌ రావు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ వాసు, తదితరులు ఉన్నారు.