ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ సామర్లకోట పట్టణంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం పర్యటించారు. తొలుత పెద్దాపురం ఎడిబి రోడ్ లోని రాక్ సిరామిక్ టైల్స్ కంపెనీని ఆయన సందర్శించారు. టైల్స్ తయారీ, మార్కెటింగ్, నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు. సిరామిక్స్ కంపెనీ ప్రతినిధులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. కంపెనీలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. అనంతరం స్థానిక 28 వార్డు గాంధీనగర్‌లో ఉన్న మంత్రి పరిచయస్తుడు జన్మయంతి రోహిత్ సమధ్ కుటుంబంతో కొంత సమయాన్ని గడిపారు. అనంతరం మంత్రి అమర్నాథ్ స్థానిక జి.రాగంపేట జగనన్న లే అవుట్ ను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబుతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న గృహాల నిర్మాణాలను మౌలిక సదుపాయాల ఏర్పాట్లు మంత్రి అమర్నాధ్‌కు దవులూరి దొరబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌లు ఊబా జాన్ మోసెస్, నెక్కంటి సాయి ప్రసాద్, కౌన్సిలర్స్‌లు రెడ్నం సునీత దొరబాబు, పాగా సురేష్ కుమార్, పితాని కృష్ణ, సేపేని సురేష్, జట్లా మోహన్, సచివాలయాల కన్వీనర్ ఇరుసుమళ్ల సాయి, చిట్టిమాని శ్రీనివాస్ పాల్గొన్నారు.










