Sep 01,2023 22:14

ప్రజాశక్తి - యంత్రాంగం
            కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారాల దెబ్బకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని సిపిఎం నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గతనెల 28వ తేదీ నుంచి ఈనెల నాలుగో తేదీ వరకూ జరిగే సిపిఎం 'సమరభేరి'లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో సిపిఎం నేతలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. అనేకచోట్ల గ్రామసచివాలయాల వద్ద ధర్నా చేపట్టి, అధికారులకు వినతులు అందించారు.
ఏలూరు : విద్యుత్‌ అదనపు ఛార్జీలు రద్దు చేయాలని, పన్నుల భారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ డిమాండ్‌ చేశారు. సిపిఎం చేపట్టిన సమరభేరిలో భాగంగా ఏలూరు పడమరవీధి, రామకృష్ణాపురం, పోస్టల్‌కాలనీ, శనివారపుపేట, శాంతినగర్‌, సత్రంపాడు తదితర ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం పోరాటం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 తగ్గించిందని విమర్శించారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్‌, డీజిల్‌ రూ.50, రూ.60కు, గ్యాస్‌ సిలిండర్‌ రూ.400కే ప్రజలకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.ఆదిశేషు, వి.సాయిబాబు, బి.జగన్నాథరావు, కె.రామాంజనేయులు, జి.రవికిషోర్‌, ఎం.ఇస్సాక్‌, ఎం.శ్రీనివాసరావు, ఎస్‌.సత్యనారాయణ, జి.కోటేశ్వరరావు, జి.ఏసుబాబు, సి.బాలరాజు, జోగి నాయుడు పాల్గొన్నారు.
భీమడోలు: సిపిఎం సమరభేరికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యకర్తలు భీమడోలు రైస్‌ మిల్లు ప్రాంతం వద్ద సమరభేరి ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాల పంపిణీ చేశారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా భాస్కర్‌రావు, కేతా నాగయ్య, బీబీ పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌ : నూజివీడు పట్టణంలోని 10, 12, 13, 15 వార్డు సచివాలయాల వద్ద సిపిఎం సమరభేరి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.రాజు, నాయకులు ఎన్‌ఆర్‌.హనుమాన్లు, శోభనాద్రి శీను, జిలాని, సాంబయ్య, అబ్బు శశి, మహాలక్ష్మి పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : మండలంలోని గవరవరంలో సిపిఎం సమరభేరి కార్యక్రమం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంచుతూ సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు శుక్లబోయిన రాంబాబు, ఆకుల దుర్గారావు, కడియం సీతారాముడు, కె.దుర్గారావు, శుక్లబోయిన మహాలక్ష్మి, ఎస్‌.వెంకటలక్ష్మి, జక్కు విజయ, దుర్గమ్మ, సత్యనారాయణ, జక్కు లక్ష్మి, శుక్ల బోయిన లక్ష్మి పాల్గొన్నారు.
వేలేరుపాడు : నార్లవరం గ్రామ సచివాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ధర్ముల రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు మడివి దుర్గారావు మాట్లాడారు. అనంతరం సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మంగరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.నాగు, సరోజిని, జల్లి వంశీ, బాలాదిత్య, తొండ, లక్ష్మయ్య, అభి, సోడే ప్రసాద్‌, పండా పంతులు ఉన్నారు.
చింతలపూడి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు డిఎన్‌విడి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పాతబస్టాండ్‌ వద్ద గల గ్రామ సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఆర్‌విఎస్‌.నారాయణ, ఎస్‌.సూర్యకుమార్‌, జోషి, రాధా, వాసు పాల్గొన్నారు.
కుకునూరు : మండలంలోని దాచారం, కుక్కునూరు సచివాలయాల వద్ద సిపిఎం సమరభేరిలో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వై.నాగేంద్రరావు, సిపిఎం నాయకులు పట్ల లక్ష్మయ్య, చుక్కమ్మ, వలీ పాషా, భద్రం పాల్గొన్నారు
కలిదిండి : మండలంలోని పెదలంక, మూలలంక, భాస్కరరావు పేట, కలిదిండి, పడమటిపాలెం సచివాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో పర్యటించి, సంతకాల సేకరణ చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు వీరవల్లి భాస్కరరావు, సిహెచ్‌.సత్యన్నారాయణ, పి.బాలాజీ, పైలా వెంకటరామకృష్ణ, సత్యనారాయణ, రాజేష్‌, మహాలక్ష్మీ, వరలక్ష్మి, శ్రీనివాసరావు, పెద్దిరాజు, ఏసు, అనిల్‌కుమార్‌, వెంకటేశ్వరరావు, గోపి, రఘు పాల్గొన్నారు.
ముసునూరు : ముసునూరు, చింతలవల్లి సచివాలయాల వద్ద సిపిఎం సమరభేరి నిరసనలు చేపట్టారు. అనంతరం పంచాయతీ సెక్రటరీకి వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల దుర్గారావు, తోటకూర ప్రసాద్‌, శ్రీను, గంగుల సత్యం, పి.కుటుంబరావు పాల్గొన్నారు.
బుట్టాయిగూడెం : మండలంలోని రెడ్డిగణపవరం, జైనవారిగూడెం సచివాలయాల వద్ద సమరభేరిలో భాగంగా వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు, మండల కమిటీ సభ్యులు కె.జలపాలు, పూనెం దుర్గారావు, తాటి రాంబాబు, మడివి రాజు పాల్గొన్నారు.
నిడమర్రు : సిపిఎం సమరభేరిలో భాగంగా భువనపల్లి సచివాలయం వద్ద ధర్నా చేపట్టి కార్యదర్శికి వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో గవర సత్యనారాయణ, కోన శ్రీనివాసరావు, వెలగలేటి మోహన్‌ పిల్లా సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : మండలంలోని ఈదులగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్తు కోటేశ్వరరావు, ఎం.బాలయ్య(స్టాలిన్‌), కె.వెంకటేశ్వరరావు, నారాయణ, మణిమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం పిలుపునిచ్చారు. సమరభేరిలో భాగంగా నాగులగూడెంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.నాగరాజు, కె.సుబ్బారావు, కె.చిరంజీవి, జి.శ్రీను, ఆర్‌.రామారావు, లక్ష్మి, ఎ.దుర్గ పాల్గొన్నారు.
చాట్రాయి : మండలంలోని చిన్నంపేటలో సిపిఎం సమరభేరిలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ వి.రమేష్‌కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్ము ఆనందం మాట్లాడారు.