May 23,2023 22:34

పెద్దాపురం సమ్మర్‌ క్యాంపులో మాట్లాడుతున్న డాక్టర్‌ స్టాలిన్‌


- వేసవి వినోద శిబిరంలో జెవికె రాష్ట్ర గౌరవాధ్యక్షులు స్టాలిన్‌
ప్రజాశక్తి - పెద్దాపురం
చిన్ననాటి నుండి విద్యార్థుల్లో చదువుతోపాటు సామాజిక విలువలపై ఆసక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌ అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపులో మంగళవారం ఆయన పాల్గొని ప్రసంగిం చారు. క్రమశిక్షణ, మానవతా విలువలపై అవగాహన పెంచటం ద్వారా విద్యార్థుల్లో మానవ సంబంధాలను పెంపొందించవచ్చన్నారు. సమ్మర్‌ క్యాంపుల వల్ల విజ్ఞానం, వినోద, స్నేహభావం అంతర్భాగమవు తాయన్నారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి సమ్మర్‌ క్యాంపుపై విద్యార్థుల్లో స్పందన తెలుసుకున్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రామారావు ఫన్నీ మ్యాథ్స్‌పై వివరించారు. శిబిరంలో ఎం ఎస్‌ సి మూర్తి,నీలపాల సుబ్రహ్మణ్యం,దుంగల పూజితా సూర్య శ్రీ,బుద్ధా శ్రీనివాస్‌, క్యాంపు కోఆర్డినేటర్‌ రొంగల అరుణ్‌, కూనిరెడ్డి అరుణ, అమృత, నమ్రత, మంజుల, సూరజ్‌, రవికుమార్‌, జ్యోత్స్న, రేణుక, డి.కృష్ణ,రవి, రేవతి ఫౌండేషన్‌ రామచంద్రపురం అధ్యక్షులు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో మంగళవారం పిఠాపు రానికి చెందిన డాక్టర్‌ ఎస్‌.చక్రవర్తి దేశభక్తి, చైతన్య గీతాలు పాడటంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం తబలా వాయిద్య సహకారంతో విద్యార్థులతో పాటలు పాడించారు. డాక్టర్‌ నెల్లి భాస్కరరావు పుస్తక పఠనం, కథలు చెప్పటంలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు, బుల్లయ్య, మరియమ్మ, పాల్గొన్నారు. కాకినాడ ఎంఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉన్నత పాఠశాలలో స్పందన ఈద ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్యర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎన్‌.రామచంద్ర మూర్తి అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన సీడ్‌ అంశంపై అవగాహన సదస్పు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఫౌండేషన్‌ జాతీయ గౌరవాధ్యక్షులు, విజయనగరం జిల్లా సైన్స్‌ అధికారి మిరియాల కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ ఉత్తమ నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు. ఫౌండేషన్‌ జాతీయ కార్యదర్శి తోటకూర సాయి రామకృష్ణ టైమ్‌ మేనేజ్‌మెంట్‌పై వివరించారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సైన్స్‌ అధికారి జి.వి.ఎస్‌ సుబ్రహ్మణ్యం పిల్లలకు మాటే మంత్రం అనే అంశంపై వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ కార్యదర్శి కేసరి శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.అమరేశ్వరరావు, సంస్ధ సంయుక్త కార్యదర్శి టి.వి.విసత్యనారాయణ, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.