కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ
సత్తెనపల్లి రూరల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బృందాలకు ప్రజాప్రతినిధులు సహకరించాలని సత్తెనపల్లి మండల అభివృద్ధి అధికారి జీవి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లి ఎంపిడిఒ కార్యాలయంలో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ ఏడాది మార్చి 31 వరకు మండ లంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి 16వ విడత సోషల్ ఆడిట్ జరుగుతుందని, ఆడిట్ బృందానికి సహకరించాలని కోరారు. 1705 పనులకు 12 కోట్ల 63 లక్షల 88వేల 24 రూపాయలకు మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయని వివరించారు. కార్యక్రమంలో ఎపిడి వెంకటనారాయణ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎఇ భావన పాల్గొన్నారు.










