సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి రాంబాబు
ప్రజాశక్తి-పద్మనాభం : సామాజిక తనిఖీ బృందాలకు ఆందరూ సహకరించాలని ఎంపిపి కంటుబోతు రాంబాబు కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ఉపాధి హమీపథకం ద్వారా చేపట్టిన పనులపై గ్రామాల్లో ఈ నెల 19 నుంచి సామాజిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. కరోనా కారణంగా మూడేళ్లుగా తనిఖీలు లేవని, 2019 ఎప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీలు ఉంటాయని చెప్పారు. దీనికి అధికారులు, విఆర్‌పిలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమములో ఎంపిడిఒ నిర్మలాదేవి, ఎంపిఎం వరలక్ష్మి, విఆర్‌పిలు పాల్గొన్నారు.










