May 03,2023 23:02

పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న తూరంగి గ్రామస్తులు

తూరంగి పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తుల ధర్నా
ప్రజాశక్తి - కాకినాడ
తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల తదితర 9 గ్రామాలకు గత 12 ఏళ్లుగా ఎన్నికలు లేక పాలకవర్గం కూడా లేకపోవడంతో సామాజిక స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, భూకబ్జా దారులు, వారికి సహాకరించే నాయకులకు ఇదొక పండగలా మారిందనీ సిపిఎం నాయకులు చింతపల్లి అజరు కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక స్థలాలు కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద తూరంగి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అజరు కుమార్‌ మాట్లా డుతూ సర్వే నెంబర్‌ 217/26 గల పార్క్‌ స్థలాన్ని కాలనీలో అభి వృద్ధి చేయాలని ప్రజలు ఎళ్లతరబడి కోరుతున్నా దీనిని అభివృద్ధి చేయకుండా నాయకులు అమ్ముకుంటూన్నారని, అభివద్ధి అనేది వీరికి ఏమాత్రం పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్క్‌ స్థలానికి కాలనీ వాసుల ఒత్తిడితో ఒక వైపు ఉత్తరం వైపు అభివృద్ధి చేసుకుంటుంటే కబ్జాదారులు మరో వైపు దక్షిణం వైపు పార్క్‌ స్థలాన్ని ఆక్రమిస్తున్నారన్నారు. ఆక్రమణకు గురతున్న పార్క్‌ స్థలానికి తక్షణం అధికారులు ఫెన్సింగ్‌ వేయాలని, పార్క్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అజరు డిమాండ్‌ చేశారు. తూరంగి ప్రభుత్వ భూముల పరిరక్షణకు, సామాజిక స్థలాల రక్షణకు జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని అజరు కుమార్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శితో ఈ సమస్యలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.