ప్రజాశక్తి - కౌతాళం
సామాజిక సేవలో మండల ప్రయివేట్ విద్యాసంస్థలు ఎప్పుడూ ముందుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ (అపుస్మా) కౌతాళం కమిటీ సెక్రటరీ సయ్యద్ దూద్ బాష తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడారు. స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ సంఘం దృష్టికి వచ్చిందని, ప్రయివేట్ పాఠశాల కరస్పాండెంట్లు అందరూ కలిసి ముందుకొచ్చినట్లు తెలిపారు. ఎంఇఒ శోభారాణి ఆధ్వర్యంలో స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాల పరిసరాలలో వర్షపు నీరు ఆగి పాఠశాలకు వెళ్లడానికి దారి లేనందున గరుసు వేయించినట్లు చెప్పారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి రోడ్డు మార్గం అనువుగా మారిందన్నారు. మండలంలో 50 నుంచి 60 శాతం రైతులు, రైతు కూలీ పిల్లలు ఉన్నారని, అలాంటి వారికి తక్కువ ఫీజులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా క్రమశిక్షణ, నైతిక విలువలు గల విద్యను అందించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నామని తెలిపారు. ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు లింగన్న, గౌస్ మోదిన్, నాగార్జున రెడ్డి, ఆంజనేయులు, సిద్ధన గౌడ్, నాగభూషణ్ గౌడ్, సురేష్ స్వామి, సిఆర్‌పి రామాంజనేయులు పాల్గొన్నారు.
గరుసు వేసిన సభ్యులు










