Oct 08,2023 00:01

మాట్లాడుతున్న వ్యవసాయ కార్మి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి

ప్రజాశక్తి-ముప్పాళ్ల : సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీలు గళమెత్తాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి అన్నారు. సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం శనివారం మండల కేంద్రంమైన ముప్పా ళ్లలోని జగన్నాథ స్వామి గుడి వద్ద శనివారం నిర్వహించగా శివనాగరాణి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికా రంలోకి వచ్చాక ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెద్ద ఎత్తున పెరిగాయని ఆందోళన వెలిబు చ్చారు. దాడుతలతోపాటు వివక్షకు వ్యతిరే కంగా వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) సంయుక్త ఆందోళనలు చేపట్టి నట్లు చెప్పారు. ఇందులో భాగంగా హైద రాబాదులో జరిగిన జాతీయ సదస్సులో 22 డిమాండ్లతో కూడిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను రూపొందించామని, వీటి కోసం దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభిం చామని తెలిపారు. ఇటీవలే విజయ వాడలో మహాధర్నా జరిగిందని, డిసెంబర్‌ 4న చలో ఢిలీ నిర్వహించనున్నామని, కోట్లాది సంతకాలు సేకరించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు విన్నవించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్‌ చట్ట సవరణ చేసి, 20 ఏళ్లు దాటిన అసైన్మెంట్‌ భూముల్ని అమ్ముకోటానికి హక్కిస్తున్నామని ప్రకటించిందని, కానీ ఎస్సైన్మెంట్‌ భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనా వాటిపై విచారణకు సిద్ధం కావడం లేదని విమర్శించారు. నిబంధనల ప్రకారం ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఆ గ్రామానికి చెందిన అసైన్మెంట్‌ భూములు జాబితాలు ప్రకటించాలని, కానీ ఎక్కడా అది అమలు జరగలేదని అన్నారు. అసైన్మెంట్‌ భూముల ప్రస్తుత పరిస్థితిని నిర్ధారించి నిషేధిత భూముల జాబితా 22ఎ సెక్షన్‌ కింద నుంచి ఆ భూములను తొలగించాల్సి ఉంటుందన్నారు. పల్నాడు జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయని, సాగర్‌ నీళ్లు లేనందువల్ల మాగాణి పంట దాదాపుగా ఎక్కడ వేయడం జరగలేదని చెప్పారు. అడపాదడపా పడుతున్న వర్షాల తో పత్తి, మిర్చి పంటలు మాత్రమే జిల్లాలో సాగుచేశారని, ఈ నేపథ్యంలో వ్యవసాయ కూలీలకు పనులు దొరకడం లేదని వివరించారు. వర్షాభావం వల్ల పంటలు పరిస్థితి మరింత దిగజారి కరువు తలెత్తే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ పరిస్థితు లన్నింటినీ గమనించి రాష్ట్ర ప్రభుత్వం కంటిన్జెంట్‌ ప్రణాళికలు సిద్ధం చేసి, వ్యవసాయ కూలీలని ఆదుకోవాలని కోరారు. కరువు, ఉపాధి, అసైన్మెంట్‌ భూ ములు, సామాజిక న్యాయం సమస్యలపై చేపట్టే పోరాటాల్లో కూలీలు కదలిరావాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య, నాయకులు బి.కోటమ్మ, జె.భగత్‌, బి.బాలకోటయ్య, ఎ.వెంకటేశ్వర్లు, పి.సైదాఖాన్‌, ఎన్‌.వెంకటేశ్వరరాజు, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.