కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కేబీ చంద్రశేఖర్
ప్రజాశక్తి- వన్‌టౌన్
విద్యార్ధులు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకొని సమాజానికి బాసటగా నిలవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కేబీ చంద్రశేఖర్ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళా శాల గ్రాడ్యుయేషన్ డే (డిగ్రీ పట్టాల ప్రధానోత్సవం) కార్య క్రమం కళాశాల ప్రాంగ ణంలో శనివారం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య కేబీ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్ధులు తమ తమ రంగాల్లో చోటు చేసు కున్న మార్పులను గమనిస్తూ ఆయా అంశాలపై పట్టు సాధించాలన్నారు. విద్యార్ధులు చదువుకున్న వారిగా సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలను, బాధ్యతలను కలిగి ఉండాలన్నారు. ఎంతో మంది తమ తమ స్థాయిల్లో శ్రమించటం వలనే మనకు అనేక సదుపాయాలు సమకూరు తున్నాయన్నారు. వాటికి సార్ధకత చేకూర్చాలన్నారు. వందలాది మంది విద్యార్ధులు ప్రత్యేక గౌను వేసుకొని ముఖ్యఅతిథి చేతుల మీదుగా డిగ్రీ పట్టాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ. నారా యణరావు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాం డెంట్ తూను గుంట్ల శ్రీనివాసు, అధ్యక్షులు టీ. శేషయ్య, కోశాధికారి అన్నం రామకష్ణారావు తదితరులు పాల్గొన్నారు.










