May 15,2023 00:09

సామాజిక భవనాన్ని ప్రారంభిస్తున్న కెకె.రాజు తదితరులు

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 43వ వార్డు పరిధి జగన్నాధపురంలో వైజాగ్‌ సౌండ్స్‌, లైటింగ్‌ డెకరేటర్స్‌ అసోసియేషన్‌ కోసం నిర్మించిన నూతన సామాజిక భవనాన్ని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని తెలిపారు. ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండే విధంగా సామాజిక నూతన భవనాలను నిర్మిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఆళ్ల లీలావతిశ్రీనివాసరావు, కె.అనీల్‌కుమార్‌రాజు, ఇఇ శ్రీనివాస్‌, ఎఇ రమణమ్మ, సీనియర్‌ నాయకులు గంగా మహేష్‌, హాబీబ్‌, మహాదస్య గోపి, కె.చిన్నా, దాడి శ్రీను, కాళీ ప్రసాద్‌, వైజాగ్‌ సౌండ్స్‌, లైటింగ్‌ డెకరేటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.