Oct 30,2023 22:49

ప్రజాశక్తి-చల్లపల్లి : ప్రభుత్వం అందించే ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు సూచించారు. చల్లపల్లి మండలం కేంద్రంలో నాబార్డ్‌ నిధులు 4 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునికరించి నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవన సముదా యాన్ని జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ సోమవారం ప్రారంభించారు. చల్లపల్లి నడిబొడ్డున 2.80 ఎకరాల విస్తీర్ణంలో 12287.92 చదరపు అడుగుల పరిధిలో 30 పడకల ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేటివ్‌ విభాగం, ఓపి - డెంటల్‌, జనరల్‌, టీబీ, రక్త పరీక్ష చేసే ల్యాబ్‌, ప్రైమరీ పోటీ కాంప్లెక్స్‌, లేబర్‌ రూమ్‌, జనరల్‌ వార్డులు, ఫిజియోథెరపీ, ఐసిటిసి, కాజువాలిటీ, స్టోర్లు వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి గ్రామ సర్పంచ్‌ పైడిపాముల కష్ణకుమారి, వైసీపీ రైతు విభాగం జోనల్‌ ఇంచార్జి కడవకొల్లు నరసింహారావు, చల్లపల్లి జడ్పిటిసి రాజులపాటి కళ్యాణి, ఎంపీపీ కోట విజయ రాధిక, వైస్‌ ఎంపీపీ మోర్ల రాంబాబు పాల్గొన్నారు.