శాలివాహనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ప్రజాశక్తి-డోన్
శాలివాహనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డోన్ నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు, నంద్యాల జిల్లా శాలివాహనుల జిల్లా అధ్యక్షులు కుమ్మరి సుధాకర్ టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కోరారు. సోమవారం యువగళం పాదయాత్ర సందర్భంగా శాలివాహనులు నారా లోకేష్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు నంద్యాల జిల్లా శాలివాహనుల జిల్లా అధ్యక్షులు కుమ్మరి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని శాలివాహనులకు కమ్యూనిటీ భవనాలు, శాలివాహన చక్రవర్తి కవయిత్రి మొల్ల విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని, కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ప్రభుత్వపరంగా నిర్వహించే విధంగా కృషి చేయాలని అన్నారు. కుమ్మర కుంటలను కాపాడి, శాలివాహనులు తమ వృత్తిపరమైన కుండలు అమ్ముకోవడానికి ప్రభుత్వం రాయితీ అందించాలని లోకేష్‌కు వివరించారు. అందుకు ఆయన సానుకులంగా స్పందించారని తెలిపారు. అనంతరం శాలివాహనులు నారా లోకేష్‌కు మర్యాదపూర్వ కంగా పూలమాలలు వేసి కలిశారు. ఈ కార్యక్రమంలో శాలివాహనులు జ్యోతిశ్వరుడు,భీమన్న,శివశంకర్,మారెళ్ళ జయచంద్ర,పుల్లయ్య, రాముడు, దస్తగిరి, సురేంద్ర,సుబ్బయ్య,శేఖర్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.










