సాహితీవేత్త లగడపాటి భాస్కర్ కన్నుమూత
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: సాహితీ కురువద్ధులు లగడపాటి భాస్కర్ (88) ఇకలేరు. వయసు పైబడటం, అనారోగ్యం కారణాలతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆయన స్వగహంలో గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సాహితీ మిత్రులతో పాటు శిష్యులు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. లగడపాటి అంతిమ సంస్కారాలు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. లగడపాటి భాస్కర చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం సదకుప్పం గ్రామంలో 1935 అక్టోబరు 15న జన్మించారు. ఈయన విద్వాన్ (తెలుగు), ఎంఏ, ఎంఈడీ చదివారు. వివిధ ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకులుగా 33ఏళ్ల పాటు పని చేశారు. లగడపాటి భాస్కర్ తన 22వ ఏటనుంచే రచనలు ప్రారంభిం చారు. ఈయన అనేకరచనలు చేశారు.అధ్యాపకులుగా పని చేసిపదవీ విరమణ చేశారు. ఈయన సాహితీ సేవకు నందమూరి తారక రామారావు నుంచి పురస్కారం అందు కున్నారు. లగడపాటి మరణం సాహి తీ లోకానికి తీరని లోటని పలువురు కవులు, రచయి తలు ఆవేదన వ్యక్తం చేశారు.
సాహితీ వేత్తల నివాళి
లగడపాటి భాస్కర్ కు పలువురు సాహితీ వేత్తలు నివాళులు అర్పించారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి, ధూర్జటి రసజ్ఞ సమాఖ్య కు తీరని లోటన్నారు. నివాళులు అర్పించిన వారిలో ధూర్జటి రసజ్ఞ సమాఖ్య ప్రధాన కార్యదర్శి యువశ్రీ మురళి, ధూర్జటి బందం గొడుగుచింత గోవిందయ్య, పట్ర జయచంద్ర రావు, తీగల వెంకటయ్య , గురునాధం, గణేష్, రవీంద్ర, శివ కుమార్, మునిసుబ్బారెడ్డి, డాక్టర్ నీరజ, జ్యోతి, అన్నపూర్ణ, పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. లగడపాటి భాస్కర్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
నాయకుల నివాళి
నివాళులు అర్పించిన వారిలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు, టీడీపీ ఇన్‌చార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఉన్నారు.










