Oct 02,2023 00:24

'సాహితీ శైలం' గ్రంథం ఆవిష్కరణ

'సాహితీ శైలం' గ్రంథం ఆవిష్కరణ
ప్రజాశక్తి - క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ విశ్రాంత ఆచార్యులు పేట శ్రీనివాసులురెడ్డి అభినందన సంచిక 'సాహితీ శైలం' గ్రంథాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఒక ప్రైవేట్‌ హోటల్‌లో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ గ్రంథానికి సంపాదకులుగా డాక్టర్‌ కుమ్మెత లక్ష్మీనారాయణ రెడ్డి వ్యవహరించారు. ఈసందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఒక రచయితను అభినందిస్తూ ఆయన రాసిన గ్రంథాలలో తన పరిశోధక విద్యార్థులు సమీక్షించి పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇలాంటి గ్రంథాల వలన అనేకమంది రచయితలు వెలుగులోకి వస్తారన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ పేటశ్రీ తిరుపతి అసిస్వాన్ని తన రచనలతో విస్తత ప్రచారం ద్వారా నిలబెట్టారన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి క్షేత్రంపై జరిగిన పరిశోధనలు లాగే శ్రీకాళహస్తి క్షేత్రంపై కూడా జరిగేటట్లు చూడాలని రచయితలకు సూచించారు. డిప్యూటీ మేయర్‌ భూమన అభినరు రెడ్డి మాట్లాడుతూ పేటశ్రీ రచించిన 'తిరుపతి కథలు' గ్రంథౄన్ని ఎమ్మెస్కో వాళ్ళు ప్రచురించారంటే ఆ గ్రంథం ప్రామాణికతను అర్థం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు మీసరగండ పాండు రంగరాజు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ, స్కూటా మాజీ అధ్యక్షులు ఆచార్య పుట్ట మునిరత్నం రెడ్డి, ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.