కడప ప్రతినిధి ఖరీఫ్ సాగు సంక్షోభంలో పడింది. గతేడాది సుమారు 122 శాతంతో పోలిస్తే 78.15 శాతం సాగు భారీ అంతరం కనిపిస్తోంది. ఈలెక్కన 44 శాతం విస్తీర్ణంలోని పొలాలు బీళ్లుగా దర్శనమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాభావం కారణంగానే పంటల సాగు ప్రశ్నార్థకంగా మా రింది. ఆగస్టులో కురిసిన వర్షపాతాన్ని మినహాయిస్తే -44 శాతం లోటు వర్షపాతం కొనసాగింది. ఆగస్టులో ఉపరితల ఆవర్తనం కారణంగా కురిసిన వర్షాల నేపథ్యంలో నేటికీ -8.6 శాతం లోటు వర్షపాతం కొనసాగు తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 2,11,553 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగు చేయాలనేది వ్యవసాయశాఖ లక్ష్యం. జూన్ నుంచి నేటి వరకు 391.8 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ 358 మి.మీ నమోదైంది. ఆగస్టులో ఆశాజనకమైన వర్ష పాతం నమోదైనప్పటికీ -8.6 మి.మీ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి వర్షాభావం కారణంగా ఖరీఫ్ సాగు సంక్షోభానికి దారితీసింది. జిల్లాలోని 2,11,553 ఎకరాల విస్తీర్ణంలో1,48,889 ఎకరాల్లో మాత్రమే విత్తనం పడడం వర్షాభావ పరిస్థితుల తీవ్రతకు అద్ధం పడుతోంది. మిగిలిన 62,644 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
సడలని...వర్షాభావం
జిల్లాలో ఆముదం మినహా వరి సాగు దగ్గర నుంచి అన్ని పంటల సాగును పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తోంది. సాగు విసీర్ణం తగ్గుదల కారణాల్లో వర్షపాతాన్ని పరిశీలిస్తే 38.4 శాతం నుంచి -8.6 శాతం కొసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లో 69.2 మి.మీగానూ 38.7 మి.మీ శాతం, జులైలో 96.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 77.4 మి.మీ మాత్రమే నమోదైంది. ఆగస్టులో 118.4 మి.మీ వర్ష పాతం నమోదులో 105.9 మి.మీ, సెప్టెంబర్‌లో 120 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సాధారణ నమోదు కింద 199 మి.మీ అధిక వర్షపాతం నమోదు కావడం ఉపశమనం కలిగించింది. ఆగస్టులో కురిసిన వర్షపాతం కారణంగా సుమారు 50 వేల ఎకరాల్లో విత్తనం పడినట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా 403.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. నేటికి వాస్తవ ప్రాతిపదికన 305.2 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 358 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం.
అన్ని పంటల సాగూ అత్తెసరే!
జిల్లాలో అన్ని పంటల సాగు అసత్తెరేనని తెలుస్తోంది. ప్రధాన ఆహార పంట వరి 91 వేల ఎకరాలకుగానూ 45 వేల ఎకరాలను సాగును మినహాయిస్తే ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. వేరుశనగ సాగు పరిస్థితిని గమనిస్తే ఆందోళన కలిగిస్తోంది. 14,177 ఎకరాల్లో వేరుశనగ విత్తనం పడాల్సి ఉండగా 8,882 ఎకరాల్లో విత్తనం పడింది. పత్తి సాగును పరిశీలిస్తే 52,839 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 41,513 ఎకరాల్లోనే విత్తనం పడింది. గతేడాది ఇదేసమయానికి సుమారు అంచ నాకు మించిన విస్తీర్ణంలో విత్తనం పడింది. ఇదేతరహాలో మోస్తరు స్థాయిలో విత్తిన పంటల వివరాలను పరిశీలిస్తే మొక్కజొన్న 2,645 ఎకరాలు, మినుములు 7,983 ఎకరాలు, కంది 10,361 ఎకరాలు, 1,365 ఎకరాల్లో సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు 627 ఎకరాలు, పసుపు 1,706 ఎకరాల్లో విత్తనం పడింది.
78 శాతమే సాగు!
ఖరీప్ సీజన్ ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులకు లోనైంది. 2,11,553 ఎకరాల సాగు లక్ష్యానికిగానూ 1,48,889 ఎకరాల్లో విత్తనం పడింది. ఇటువంటి క్షామ పీడిత పరిస్థితుల నేపథ్యంలో 78 శాతమే పంటల సాగుకు పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లెక్కన 62,664 ఎకరాలు బీళ్లుగా దర్శనమిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. పదేళ్లకుపైగా ఇటువంటి పరిస్థితి ఎదురు కావడంపై రైతాంగంలో నిరాశానిష్ఫృహలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రతి ఏటా వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా సగటున 25 వేల ఎకరాలకుపైగా ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నట్లు వ్యవసాయశాఖ నిపుణులు పేర్కొంటున్న పరిస్థితి కని పిస్తోంది.
కెసి ఆశలు గల్లంతు
ప్రతి ఏటా ఆగస్టు 16న కెసి కెనాల్‌కు నీటిని విడుదల చేయడం పరిపాటి. సెప్టెంబర్ చివరి వారంలో కెసి కెనాల్‌కు నీటిని విడుదల చేయలేమని అధికారులు పేర్కొనడం నిరాశను మిగిల్చింది. కెసి కెనాల్ ఆయ కట్టు పరిధిలోని 91 వేల ఎకరాల్లో పంటలు సాగుకు గానూ ఎనిమిది వేల ఎకరాల్లోనే నీటిని విడుదల చేసే అవకాశం నెలకొంది. 83 వేల ఎకరాల ఆయకట్టు బీళ్లుగా దర్శనమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.










