Aug 05,2023 22:09

సిఎం సభా స్థలాన్ని పరిశీలిస్తున్న అశోక్‌గజపతిరాజు, నాయకులు

పార్వతీపురం రూరల్‌: వైసిపి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లువదిలేసి రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని కేంద్ర మాజీ మంత్రి పి.అశోకగజపతిరాజు అన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో విజయనగరం, పార్వతీపురం జిల్లా ఇన్చార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈనెల 8,9 తేదీల్లో ఉభయజిల్లాల్లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనపై సన్నాహక కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావుతో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన విధ్వంసకర పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అధోగతిపాలైందని విమర్శించారు. తమ ఐదేళ్ల పాలనలో రూ.12000కోట్లకు పైగా నిధులు సాగునీటి రంగానికి ఖర్చు చేస్తే తమ నాలుగేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వ కనీనం రూ.2వేల కోట్లు కూడా ఖర్చుచేయలేకపోయిందన్నారు. మూడు రాజధానుల పేరిటి అమరావతిని, రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పోలరాన్ని భ్రష్టుపట్టించారని, సంక్షేమ పథకాల పేరిటి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ప్రజలపై ఎనలేని రుణభారాన్ని రుద్దారని అన్నారు. సాగునీటి తీరుతెన్నులు, ప్రభుత్వ నిర్వాణాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతో తమ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన చేపట్టారని, ప్రజలకునిజాన్ని వెల్లడిస్తుంటే తట్టుకోలేక దాడులకు దిగబడుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు ఈనెల 8న రాత్రి విజయనగరం చేరుకుని, రైతులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తారని, 9న పార్వతీపురం మీదుగా తోటపల్లి రిజర్వాయర్‌ చేరుకుని పరిశీలించిన అనంతరం, పార్వతీపురంలో రోడ్‌, బహిరంగ సభను నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అరకుపార్లమెంటరీ అధ్యక్షులు గుమ్మడి సంధ్యారాణి, కిమిడి నాగార్జున, కోళ్ల లతితాకుమారి, బోనాల విజయచంద్ర, దామచర్ల సత్యనారాయణ, బి.గోవిందరాజులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, నాయకులు తోయిక జగదీశ్వరి, నిమ్మక జయకష్ణ, వీరేంద్రదేవ్‌తో పాటు వలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
చిరంజీవులును పరామర్శ
ఇటీవల్ల తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును టిడిపి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల టిడిపి సీనియర్‌, ముఖ్యనాయకులు కృష్ణపల్లిలోని ఆయన స్వగహానికి వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి కిమిటి కళావెంకటరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో టిడిపి పార్టీకి చిరంజీవులు చేసిన సేవలు పార్టీ ఎన్నడూ గుర్తుంచుకోవడమే కాకుండా ఆయన సేవలను భవిష్యత్తులో వినియోగించుకుంటుందన్నారు. ఆరోగ్యం కుదిటపడిన తర్వాత ఎప్పటిలాగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నియోజకవర్గలో టిడిపి గెలువులో ముఖ్యభూమిక వహిస్తారని వెల్లడించారు.
సభా ప్రాంగణం పరిశీలన:
గరుగుబిల్లి : మండలంలో ఎర్రనగుడి జంక్షన్‌ వద్ద మీటింగ్‌ చంద్రబాబు ఏర్పాటు చేయనున్నారు. మీటింగ్‌ ఏర్పాటు జరిగే స్థలాన్ని అశోక్‌ గజపతిరాజు సమన్వయ కమిటీ సభ్యులు పరిశీలించారు.
తో పాటు స్థలమును సందర్శించి సభను ఏర్పాటు చేసేందుకు సభ స్థలము అనుకూలంగా ఉన్నదా లేదా అనే విషయంలో పరిశీలించడం జరిగింది. ఎర్రగుడి జంక్షన్‌ దగ్గరలో తోటపల్లి రిజర్వాయర్‌ ఆనుకొని ఉన్న హెలిపాడ్‌ గ్రౌండ్‌ వద్ద ఈనెల తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీటింగ్‌ నిర్వహించడం జరుగుతుందని ఆ తర్వాత రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.