Oct 22,2023 22:13

 మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌
ప్రజాశక్తి-అవనిగడ్డ :
సాగునీటి సంక్షోభం నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులకు శాపంగా మారిందని సాగునీటి కోసం టిడిపి జనసేన ఆధ్వర్యంలో ఉద్య మిస్తామని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ హెచ్చ రించారు. ఆదివారం నాగాయలంక మండల పరిధిలోని కమ్మనమోల సెంట్రల్‌ ఛానల్‌ 3 ఏ పరిధిలో ఎండిపోతున్న వరి పొలాలు పరిశీలించారు. సాగునీటి అధికారులు ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి వచ్చి రైతులకు భరోసా కల్పించిన దాఖలాలు లేవన్నారు గత ప్రభుత్వంలో సాగునీటి కొరత ఏర్పడిన సమయంలో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అండగా ఉండేవారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబుకు రైతులు గోడు పట్టదని కనీసం ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించాలన్న ఆలోచన కూడా లేదన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో రైతులను కాపాడుకోవడం ప్రజాప్రతినిధుల ప్రథమ కర్తవ్యం అని, కానీ ఇక్కడ ప్రజాప్రతినిధి వ్యవసాయాన్ని విస్మరించి రైతును రక్షించకుండా ప్రశ్నించిన వారిని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు. భూమి నెర్రలు ఇచ్చి రైతులు దిక్కుతోచని స్థితికి చేరారని, ఇటువంటి పరిస్థితుల్లో వంతును పెంచి చివరి భూములకు నీళ్లు అందించాలని కోరారు. చివరి భూముల వరకు సాగునీటిని అందించకపోతే ఉభయ పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాగునీరు వచ్చి 20 రోజులు పైగా అయిందని పలుకుబడి ఉన్న వారు కొందరు ముందుగా సాగునీటిని తమ పొలాలకు మళ్ళించుకుంటున్నానని నోరులేని రైతులు మాత్రం కాల్వగట్లపై కూర్చొని నీళ్లు ఎప్పుడు వస్తాయని ఎదురుచూడాల్సి వస్తోందని పలువురు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భావదేవరపల్లి సర్పంచ్‌ మండలి ఉదయభాస్కర్‌, రైతు నాయకులు బావిరెడ్డి వెంకటేశ్వరరావు, గ్రామ రైతులు పాల్గొన్నారు