
ప్రజాశక్తి-ఉయ్యూరు : కాల్వల్లో నీరు రాక పొలాల్లో వరిపంట ఎండిపోతుందని సాగు నీరందించి పంటలు కాపాడాలని కోరుతూ కలవపా ములలో రైతులు విజయవాడ- గుడివాడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాల్వల ద్వారా పొలాలకు నీరందక బీటలు వారుతుంటే పెరిగిన పచ్చని పైరు ఎండి పోతుందని రైతులు రోడ్డుపై తాటి దుంగలు అడ్డుగా ఉంచి ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపో యింది. అనంతరం లాకులవద్దకు చేరి ఆందోళనకు దిగారు, పరిస్థితిని గ్రామ సర్పంచ్ పొనుగుమాటి సుబ్రమణ్యేశ్వరరావు ఫోన్ ద్వారా ఇరిగేషన్ అధికారుల దష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. సాయంత్రా నికి నీరందిస్తా మన్న ఇరిగేషన్ అధికారుల హామీ మేర రైతుల ఆందోళన విరమించారు.