ప్రజాశక్తి-తాళ్లరేవు పి.మల్లవరం పంచాయతీ గ్రాంటు ప్రాంతంలో సుమారు 500 ఎకరాల్లో సాగునీరు లేక పంట పొలాలు బీటలు వాడుతున్నాయని ఆ ప్రాంతానికి చెందిన రైతులు తాళ్ళరేవు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు సూరంపూడి శ్రీనివాస్, బాదం ఏడుకొండలు, రాయుడు వీర్రాజు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో మెయిన్ కాలువ కింద రెండెకరాలు, చింతాబోదు కింద 120 ఎకరాలు, పెదమాడి కాపుల బోదు కింద 180 ఎకరాలు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయనిా ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలు ఈనిక దశలో ఉండగా తొలకరిలోనే నీటి ఎద్దడి రావడం రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తెలిపారు. 20 రోజుల నుంచి ఉన్న పరిస్థితిని అధికారులకు తెలియజేసిన నేటికీ ఎటువంటి చర్యలు తీస ుకోలేదన్నారు. నీటి ఎద్దడి సమయంలో ఒఎన్‌జిసి పైపులైన్ ద్వారా గ్రాంటు ప్రాం తానికి సాగునీరు అందించి అధి కారులు తక్షణ చర్యలు చేపట్టే వారని, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఒఎన్‌జిసి కంపెనీ ప్రతి నిధులతో మాట్లాడి వెంటనే సాగునీరు పైప్‌లైన్ ద్వారా తరలించాలని కోరారు. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, రైతులు పిల్లి శ్రీను, వాసంశెట్టి కృష్ణ, పి.భైరవమూర్తి, పితాని శ్రీను, బాదం సత్యనారాయణ, మేడిశెట్టి శ్రీను పాల్గొన్నారు.










