Aug 01,2023 00:20

బీడువారిన పొలం

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
ఒకవైపు గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నా, మరోవైపు వర్షాలు అడపా దడపా పడుతున్న రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పట్లేదు. సామర్లకోట మండలం నవరలో తమ పొలాలకు సాగునీరు అందటం లేదని పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామానికి చెందిన పంట పొలాలకు సాగునీరు అందించే కాలువల్లో మట్టి దిబ్బలు, పూడికలు, గుర్రపు డెక్క, పేరుకుపోయాయన్నారు. దీనంతో నీరు పారట్లేదన్నారు. ఫలితంగా సాగునీరు అంట్లేదని రైతులు సిద్దు గోవింద రాజు, నాగు, బుజ్జి, దొరబాబు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. లంక కాలువ పూడుకుపోయిందన్నారు. దీంతో తమ పొలాలు బీటలు వారాయన్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టగా అవి ఉపయోగం లేకుండా పోతున్నా యన్నారు. దీనిపై అధికారులు గానీ, ప్రభుత్వం గానీ స్పందించట్లేదన్నారు. తక్షణమే ఇరిగేషన్‌, వ్యవసాయ అధికారులు స్పందించి సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు సుబ్బారావు, చక్రయ్య, తదితరులు కోరుతున్నారు.