పలాస: పలాస, వజ్రపుకొత్తూరు మండలాల శివారు భూములకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అసమర్ధత వల్ల వంశధార అందడంలేదని జనసేన నియోజకవర్గం నాయకులు డాక్టర్ వి.దుర్గారావు విమర్శించా రు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెక్కలిలో అచ్చెన్నాయుడు, నరసన్నపేటలో దర్మాన కృష్ణదాస్ ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడం వల్లే శివారు భూములకు సాగునీరు అందించడం లేదన్నారు. శివారు భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార నీరు సరఫరా చేయకపోయినా రైతులు నుంచి నీటి తీరువా ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. అనధికార ఎత్తిపోతల పథకాలను తొలగించకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారని మంత్రి అప్పలరాజును ప్రశ్నించారు. శివారు భూములకు సాగు నీరు అందించే వరకు జనసేన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు వంశధార సాగునీరుపై నమ్మకం లేక ఊబాలు వేయకుండా ఎదలు వేస్తున్నారని ఈ విషయం మంత్రి సీదిరి అప్పలరాజు తెలుసుకోవాలన్నారు. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు సాగునీరు అందించాల్సిన పాలకుల నిర్లక్ష్యంతోనే ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వంశ ధార శివారు భూములకు సాగు నీరు అందకపోవడం అన్నదా తలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.










