Aug 06,2023 21:58

వట్టిగెడ్డ నుంచి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

ప్రజాశక్తి - కురుపాం : జియ్యమ్మవలస మండలం రావాడ వట్టి గెడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ సాగు నీటిని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి విడుదల చేశారు. ఈ నీరు విడుదల చేయడం ద్వారా ఈ వట్టిగెడ్డ రిజర్వాయర్‌కు దిగువనున్న 16,684 ఎకరాల ఆయకట్టు దారులకు సాగునీరందుతుంది. ఖరీఫ్‌కు సాగునీటి ఇబ్బంది ఉండకుండా పంటలు బాగా పండించు కోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ఈ ప్రాంత రైతులు ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ డిఇ డి.ఉదయభాస్కరరావు, జెడ్‌పిటిసి ఎం.శశికళ, మండల కన్వీనర్‌ ఎం.గౌరీశంకర్‌, వైస్‌ ఎంపిపిలు, ఇరిగేషన్‌ ఎఇలు, స్థానిక సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.